Nagilla: నాగిళ్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం సర్పంచ్ సంతోష రాజు!

Nagilla: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నాగిళ్ల గ్రామంలో నవంబర్ 1న ఉచిత వైద్య శిబిరం. శాలివాహన ఆసుపత్రి వైద్యుల సహకారంతో పరీక్షలు, మందులు ఉచితం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Nov 2026 7:52 AM IST
Nagilla
X

Nagilla: నాగిళ్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం సర్పంచ్ సంతోష రాజు!

Nagilla: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మాడుగుల మండలం నాగిళ్ల గ్రామంలో నవంబర్ 1వ తేదీన ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. నాగిళ్ల గ్రామ సర్పంచ్ పాలకూర్ల సంతోష రాజు గౌడ్ ఆధ్వర్యంలో, శాలివాహన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

రైతు వేదిక (నాగిళ్ల)లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం కొనసాగనుంది. ఈ శిబిరంలో శాలివాహన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకోవాలని, పరిసర గ్రామాల ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY