Hyderabad: రహమత్ నగర్‌లో ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్!
Hyderabad: జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ ఎస్‌పీఆర్ హిల్స్‌లో బ్లూ క్రాస్, మిషన్ రేబిస్ ఆధ్వర్యంలో ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్. హాజరైన అక్కినేని అమల.
Hyderabad: రహమత్ నగర్‌లో ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్!
Hyderabad: రేబిస్ రహిత తెలంగాణ లక్ష్యంగా బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ మరియు మిషన్ రేబిస్ సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, రహమత్ నగర్ డివిజన్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్‌లో ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అక్కినేని అమల గారు, రహమత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి గారు, నిర్వాహకులు రమేష్ గారుతో పాటు పలువురు పాల్గొన్నారు.
కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ అందిస్తూ, ప్రజల్లో రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. రేబిస్ నియంత్రణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.




