Vikarabad: అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా..నలుగురు మృతి!

Vikarabad: వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తాపడి నలుగురు మృతి, పలువురికి గాయాలు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన మంత్రి.

MOGULAIAH, VIKARABAD
Published on: 3 Oct 2026 5:53 PM IST
Vikarabad
X

Vikarabad: అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా..నలుగురు మృతి!

Vikarabad: వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండల ఘాట్‌ రోడ్డులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్టిఎ, ఫారెస్ట్ అధికారులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. వికారాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ అంబులెన్సులను సకాలంలో సంఘటనా స్థలానికి తరలించి క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.

తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

ప్రాణాలకు తెగించి ప్రయాణికులను రక్షించిన స్థానికులు.

బస్సు బోల్తా పడిన సమయంలో సమీపంలో ఉన్న ముగ్గురు స్థానికులు వెంటనే స్పందించారు. బస్సు అద్దాలను పగులగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాద తీవ్రత మరింత పెరగకుండా, మరిన్ని ప్రాణనష్టాలు సంభవించకుండా వారు చేసిన సహాయక చర్యలను పలువురు ప్రశంసించారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి

ప్రమాద సమాచారం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

తీవ్రంగా గాయపడిన వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ప్రైవేట్ బస్సు యాజమాన్యం పై కానీ బస్సు నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యం వహించినట్లయితే పూర్తి విచారణ జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD