Shabad: వ్యాపార రంగంలో యువత రాణించాలి: పట్నం అవినాష్ రెడ్డి!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం వెంకటాపూర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన నూతన సూపర్ మార్కెట్‌ను మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 11 Oct 2026 9:24 PM IST
Shabad
X

Shabad: వ్యాపార రంగంలో యువత రాణించాలి: పట్నం అవినాష్ రెడ్డి!

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ గేట్ సమీపంలో చిన్న సోలిపేట గ్రామానికి చెందిన ప్రహ్లాద్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌ను ఆదివారం షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పట్నం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపార రంగంలో నూతనంగా అడుగుపెట్టిన ప్రహ్లాద్ రెడ్డి భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

వ్యాపార రంగంలో పట్టుదల, కృషితో ముందుకు సాగుతూ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించి మంచి పేరు సంపాదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA