Shabad: షాబాద్ శివాలయానికి రూ.1 లక్ష విరాళం ఇచ్చిన మాజీ జడ్పీటీసీ అవినాష్!

Shabad: షాబాద్ మండల కేంద్రంలోని పునర్నిర్మించిన శివాలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పాల్గొని ఆలయానికి రూ.1 లక్ష విరాళం అందజేశారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 29 Nov 2026 1:44 PM IST
Shabad
X

Shabad: షాబాద్ శివాలయానికి రూ.1 లక్ష విరాళం ఇచ్చిన మాజీ జడ్పీటీసీ అవినాష్!

Shabad: షాబాద్ మండల కేంద్రంలోని నూతనంగా పునర్నిర్మించిన శివాలయానికి మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఆదివారం ఉదయం శివాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఆలయ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారంగా లక్ష రూపాయలను విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.

విరాళం అందించిన పట్నం అవినాష్ రెడ్డిని గ్రామ పెద్దలు శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు సహకరించిన దాతలను గ్రామస్తులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండాల అశోక్, మాజీ సర్పంచ్ కల్వకోల్ వెంకట్ యాదవ్, ఉప సర్పంచ్ దండు రాహుల్, గ్రామ పెద్దలు దర్పల్లి రవీందర్ గౌడ్, కొండ విజయ్ కుమార్, కొండ ప్రదీప్ , మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA