Thalakondapally: యాదవ, ముదిరాజ్ సంఘాలకు వంట సామగ్రి, గ్యాస్ పంపిణీ!
Thalakondapally: రాంపూర్ గ్రామంలో యాదవ, ముదిరాజ్ సంఘాలకు మాజీ జెడ్పీటీసీ పద్మ నరసింహ రూ.25 వేల విలువైన వంట సామగ్రి, గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు.
Thalakondapally: యాదవ, ముదిరాజ్ సంఘాలకు వంట సామగ్రి, గ్యాస్ పంపిణీ!
Thalakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం, ముదిరాజ్ సంఘాలకు తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ పద్మ నరసింహ సుమారు రూ.25 వేల విలువైన వంట సామగ్రి, గ్యాస్ సిలిండర్లను అందజేశారు. సంఘాల అవసరాలను గుర్తించి సామగ్రిని అందించడం పట్ల ఆయా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామంలో కుల సంఘాల అభివృద్ధికి, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఇలాంటి సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు పేర్కొన్నారు. వంట సామగ్రి, గ్యాస్ సిలిండర్లు సంఘాల కార్యక్రమాలకు తోడ్పడతాయని తెలిపారు. ఈ సందర్భంగా యాదవ, ముదిరాజ్ సంఘాల సభ్యులు పద్మ నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యుడు కటికెల మధు యాదవ్, మాజీ ఎంపీటీసీ కటికల యాదయ్య, రాంపూర్ చెరువు జనరల్ సెక్రటరీ చిలుకం శేఖర్, మాజీ ఆలయ చైర్మన్ మొక్తాల రాఘవేందర్ గౌడ్, ముదిరాజ్ యువ నాయకులు చప్పిడి శేఖర్, రొయ్యల మహేష్, రొయ్యల రమేష్ తదితరులు పాల్గొన్నారు.




