Rangareddy: కడ్తాల్లో మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందించిన LN రెడ్డి!
Rangareddy: కడ్తాల్ మండలానికి చెందిన బోనగిరి శరణప్ప మృతి చెందడంతో కుటుంబానికి రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేసి పరామర్శించిన మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి.
Rangareddy: కడ్తాల్లో మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందించిన LN రెడ్డి!
Rangareddy: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కడ్తాల మండల కేంద్రానికి చెందిన బోనగిరి శరణప్ప అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం హైదరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి కడ్తాల్ కేంద్రంలో శరణప్ప భౌతికకాయానికి నివాళులర్పించి, మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి 5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని,అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు తావివ్వకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటామని,సమాజ శ్రేయస్యే తమ ధ్యేయమని, మండల పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామని బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ వెంట కోసిక యాదయ్య,రఘు, భిక్షపతి,వెంకటేష్ తదితరులు ఉన్నారు.




