Shabad: షాబాద్‌లో ఘనంగా శ్రీ దుర్గామాత పూజా కార్యక్రమం!

Shabad:షాబాద్ దసరా నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ప్రభాకర్!

RAGHAVENDRA, CHEVELLA
Published on: 18 Oct 2026 6:28 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో ఘనంగా శ్రీ దుర్గామాత పూజా కార్యక్రమం!

Shabad: షాబాద్ గ్రామంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన శ్రీ దుర్గామాత పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం,ప్రభాకర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను పలువురు అభినందించారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA