Maheshwaram: మహేశ్వరంలో నూతన జిమ్ సెంటర్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే KLR!
Maheshwaram: మహేశ్వరం మండల కేంద్రంలో రఘుపతి ఏర్పాటు చేసిన నూతన జిమ్ సెంటర్ను మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (KLR) సోమవారం ప్రారంభించారు.
Maheshwaram: మహేశ్వరంలో నూతన జిమ్ సెంటర్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే KLR!
మహేశ్వరం: మండల కేంద్రంలో రఘుపతి నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (KLR) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని పేర్కొన్నారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ జిమ్, వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఫిట్నెస్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు రఘుపతి, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.




