Secunderabad: ఓల్డ్ బోయిగూడలో వినాయక పూజల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్!

Secunderabad: రాంగోపాల్‌పేట డివిజన్ ఓల్డ్ బోయిగూడలో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణేష్ నిమజ్జనంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు.

Srikanth, Secunderabad
Published on: 25 Sept 2026 7:30 PM IST
Secunderabad
X

Secunderabad: ఓల్డ్ బోయిగూడలో వినాయక పూజల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్!

సికింద్రాబాద్: గణ నాధుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. శుక్రవారం రాంగోపాల్ పేట డివిజన్ ఓల్డ్ బోయిగూడా లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణ నాధుడి నిమజ్జనం సందర్భంగా ఆయన శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

అనంతరం నిర్వాహకులు నిమజ్జనానికి శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు టీనా గౌడ్, జనార్దన్ తదితరులు ఉన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad