Talasani Srinivas Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తలసాని, గోలి శ్రీనివాస్ రెడ్డి!
Talasani Srinivas Yadav: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి శ్రీకాళహస్తి, తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Talasani Srinivas Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తలసాని, గోలి శ్రీనివాస్ రెడ్డి!
తలసాని శ్రీనివాస్ యాదవ్: ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. తొలుత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న వారు.. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో గడిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అనుచరులు ఉన్నారు.




