LB Nagar: మోదీ మన్‌కీ బాత్‌ను వీక్షించిన మాజీ కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి!

LB Nagar: ఎల్బీనగర్ హైకోర్టు కాలనీ డివిజన్‌లో ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌ను మాజీ కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి వీక్షించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 Nov 2026 1:35 PM IST
LB Nagar
X

LB Nagar: మోదీ మన్‌కీ బాత్‌ను వీక్షించిన మాజీ కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి!

LB Nagar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. హైకోర్టు కాలనీ డివిజన్ అధ్యక్షుడు మర్రి మధుసూదన్‌రెడ్డి కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించిన సంచార్ సాథీ, కర్మయోగి భారత్ కార్యక్రమాల ప్రాధాన్యతను నవజీవన్‌రెడ్డి వివరించారు. మొబైల్ వినియోగదారుల భద్రత, సైబర్ మోసాల నివారణ, పోగొట్టుకున్న ఫోన్ల గుర్తింపునకు సంచార్ సాథీ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, మెరుగైన ప్రజాసేవల కోసం కర్మయోగి భారత్ దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ రెండు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. డిజిటల్ భద్రత, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీచర్స్ సెల్ కన్వీనర్ వెంకన్న, నాయకులు జంగారెడ్డి, గాండ్ల సందీప్, అరుణ్, నరేన్, బీజేవైఎం జిల్లా నాయకుడు ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR