Secunderabad: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు పరిశీలన: డా. సామల హేమ!
Secunderabad: సీతాఫలమండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పరిశీలించారు.
Secunderabad: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు పరిశీలన: డా. సామల హేమ!
సికింద్రాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ డా. సామల హేమ సీతాఫలమండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు హెల్ప్ డెస్క్ వద్ద మాజీ కార్పొరేటర్ డా. సామల హేమ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా ఈసారి మళ్లీ ఓటరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి ఓటు కీలకమని, అర్హులైన గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు చేసుకునేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని డా. సామల హేమ కోరారు.




