Hyderabad: భారతీయుల కోసం జాంజిబార్‌లో రియల్ ఎస్టేట్ అవకాశాలు!

Hyderabad: భారతీయులకు సరికొత్త రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా జాంజిబార్ ఫ్లోటాన్ ఆఫ్రికా ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇన్వెస్టర్లకు హాలిడే హోమ్స్, లగ్జరీ ప్రాపర్టీల పరిచయం.

RAJESH,	WEST ZONE
Published on: 2 Oct 2026 5:54 PM IST
Hyderabad
X

Hyderabad: భారతీయుల కోసం జాంజిబార్‌లో రియల్ ఎస్టేట్ అవకాశాలు!

హైదరాబాద్: భారతీయ కొనుగోలుదారులకు జాంజిబార్ లోని రియల్ ఎస్టేట్ అవకాశాలను పరిచయం చేసేందుకు ఫ్లోటాన్ ఆఫ్రికా లిమిటెడ్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణకు చెందిన పెట్టుబడిదారులకు జాంజిబార్ లోని రియల్ ఎస్టేట్, హాలిడే హోమ్స్, లైఫ్ స్టైల్ లివింగ్, పెట్టుబడి అవకాశాలను చేరువ చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

హిందూ మహాసముద్రంలోని ప్రశాంతమైన, సుందరమైన దీవుల్లో జాంజిబార్ ఒకటని, భారతదేశం నుంచి సుమారు 8 నుంచి 10 గంటల ప్రయాణ దూరంలో ఉందని తెలిపారు. పర్యాటక రంగంతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కూడా జాంజిబార్ లో అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. తీరప్రాంత జీవనశైలికి అనుగుణంగా ఆధునిక నివాసాలను అందించడంతో పాటు, పెట్టుబడిదారులకు వివిధ రకాల రియల్ ఎస్టేట్ అవకాశాలను అందిస్తున్నట్లు పేర్కొంది.

తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త సప్నా బ్రహ్మరౌతు జాంజిబార్లోని రియల్ ఎస్టేట్ అవకాశాలను భారతీయ కొనుగోలుదారులకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఆఫ్రికాలో వ్యాపార అనుభవంతో పాటు టాంజానియా, జాంజిబార్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE