Hyderabad: హైటెక్ సిటీ రహేజా మైండ్‌స్పేస్‌లో అగ్నిప్రమాదం!
Hyderabad: హైదరాబాద్ హైటెక్ సిటీ రహేజా మైండ్‌స్పేస్ బిల్డింగ్ నంబర్ 1 టెర్రస్‌పై వెల్డింగ్ పనుల నిప్పురవ్వల వల్ల అగ్నిప్రమాదం జరిగింది.
Hyderabad: హైటెక్ సిటీ రహేజా మైండ్‌స్పేస్‌లో అగ్నిప్రమాదం!
Hyderabad: హైటెక్ సిటీ పరిధిలోని రహేజా మైండ్‌స్పేస్ బిల్డింగ్ నంబర్ 1 వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం టెర్రస్‌పై ఉన్న కూలింగ్ టవర్ల వద్ద వెల్డింగ్ పనులు జరుగుతుండగా ఎగిసిన నిప్పురవ్వల కారణంగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఒక కూలింగ్ టవర్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.




