Hayathnagar: బాటసింగారంలో ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం!

Hayathnagar: రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరగ్గా, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

AJAY, HAYATH NAGAR
Published on: 29 July 2026 4:00 PM IST
Hayathnagar
X

Hayathnagar: బాటసింగారంలో ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం!

హయత్ నగర్: బాటసింగారం ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం.. వెంటనే అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామ సమీపంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో బుధవారం చిన్నపాటి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే హయత్‌నగర్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం ఇబ్రహీంపట్నం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, గోడౌన్‌లో జరిగిన నష్టంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story