Shankarpally: దొంతంపల్లిలో ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం!

Shankarpally: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఫర్నిచర్ షాప్ దగ్ధమైంది. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 18 Nov 2026 10:37 AM IST
Shankarpally
X

Shankarpally: దొంతంపల్లిలో ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం!

Shankarpally: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతంపల్లి గ్రామంలోని ఏవన్ ఫర్నిచర్ షాప్‌లో విద్యుత్ ఘాతంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణంలో ఉన్న ఫర్నిచర్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో షాపులోని ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA