Punjagutta: రాజ్యాంగ పరిరక్షణకు పోరాడాలి, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి!

Punjagutta: హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు జి. చెన్నయ్య పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 26 Nov 2026 5:46 PM IST
Punjagutta
X

Punjagutta: రాజ్యాంగ పరిరక్షణకు పోరాడాలి, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి!

హైదరాబాద్: హైదరాబాద్ పంజాగుట్టలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడు బాల ప్రకాష్ ఆధ్వర్యంలో మాల మహానాడు సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా తమకు ఇంకా రాజ్యాంగ హక్కులు పూర్తిస్థాయిలో అందలేదనే భావన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజ్యాంగ పరిరక్షణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారూ.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE