Chevella: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తాపడి ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు!
Chevella: చేవెళ్ల మండల పరిధిలోని పామెన గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి పొత్గల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గౌడ్ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
Chevella: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తాపడి ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు!
Chevella: చేవెళ్ల మండల పరిధిలోని పామెన గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి అవతలి రోడ్డు పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ఉండగా ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదానికి గురైన వారు షాబాద్ మండలం పొత్గల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గౌడ్, మురళి గౌడ్, ఒగ్గు వెంకటయ్య, కార్ల శివకుమార్ గుర్తించారు. రాజకుమార్ గౌడ్ అనే వ్యతి మృతి చెందడం జరిగింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను తొలుత మొయినాబాద్ మండలంలోని భాస్కర ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. బ్రిడ్జి కుంగడమే ప్రమాదానికి కారణమా?
ఈ ప్రమాదానికి కారు అతివేగంతో ప్రయాణించడం ఒక కారణమైతే, రోడ్డుపై వర్షపు నీరు వెళ్లేందుకు నిర్మించిన చిన్న బ్రిడ్జిపై రోడ్డు కుంగిపోవడం కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే బ్రిడ్జి వద్ద గతంలోనూ ప్రమాదం జరిగి పొత్గల్ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఒకే ప్రాంతంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బ్రిడ్జి పై ఉన్న రోడ్డుకు పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




