Vikarabad: పశువుల కొట్టంలో భారీ కొండచిలువ.. చంపకుండా పట్టుకున్న రైతు సాహసం!

Vikarabad: వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారంలో పశువుల కొట్టంలోకి దూరిన కొండచిలువను రైతు బోయిని నర్సింహులు సురక్షితంగా పట్టుకున్నారు.

WAZID, PARIGI
Published on: 22 Nov 2026 8:14 AM IST
Vikarabad
X

Vikarabad: పశువుల కొట్టంలో భారీ కొండచిలువ.. చంపకుండా పట్టుకున్న రైతు సాహసం!

Vikarabad: వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయిని నర్సింహులు అనే రైతు పశువుల కొట్టంలోకి ఓ కొండచిలువ దూరింది.

రైతు నర్సింహులు ఏమాత్రం భయపడకుండా, పామును కొట్టి చంపకుండా ఎంతో ధైర్యంతో దానిని పట్టుకుని తన వద్ద ఉన్న బోనులో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హీర్యా నాయక్, సిబ్బంది.. కొండచిలువను చంపకుండా సురక్షితంగా పట్టుకున్న రైతు నర్సింహులు ధైర్యాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రతిమ ప్రత్యేకంగా అభినందించారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా, గాయపరచకుండా తమకు సమాచారం అందించాలని ఎఫ్‌ఎస్‌ఓ హీర్యా నాయక్ ప్రజలకు సూచించారు.

అనంతరం అటవీ సిబ్బంది ఆ కొండచిలువను తీసుకెళ్లి మహ్మదాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సురక్షితంగా వదిలిపెట్టారు. రైతు నర్సింహులు చూపిన సమయస్ఫూర్తి, సాహసాన్ని తోటి గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI