Ghatkesar: ఘట్‌కేసర్ వందన హోటల్ బిర్యానీలో బొద్దింక అస్వస్థతకు గురైన కుటుంబం1
Ghatkesar: ఘట్‌కేసర్‌లోని వందన హోటల్‌లో పన్నీర్ బిర్యానీలో బొద్దింక రావడంతో తిన్న కుటుంబం తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Ghatkesar: ఘట్‌కేసర్ వందన హోటల్ బిర్యానీలో బొద్దింక అస్వస్థతకు గురైన కుటుంబం1
Ghatkesar: హోటల్‌లో పన్నీర్ బిర్యానీ తిన్న ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని వందన హోటల్‌లో కుటుంబ సభ్యులు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. అయితే బిర్యానీలో బొద్దింకలు కనిపించడంతో వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే కుటుంబ సభ్యులకు వాంతులు కావడంతో అస్వస్థతకు గురయ్యారు.
దీంతో చికిత్స కోసం స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు బాధితులు తెలిపారు. బిర్యానీలో బొద్దింకలు కనిపించిన విషయాన్ని హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరగా.. సిబ్బంది తమతో దురుసుగా మాట్లాడినట్లు బాధితులు ఆరోపించారు. ‘‘మీకు తోచింది చేసుకోండి’’ అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో బాధితుడు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను సంబంధిత అధికారులు పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. ఘటనపై విచారణ జరిపి, ఆహారంలో బొద్దింకలు కనిపించడానికి కారణాలను గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వందన హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.




