Hyderabad: ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు.. భారీగా అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం!
Hyderabad: పహాడ్ షరీఫ్ వద్ద ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు. గోవా, ఢిల్లీ ప్రాంతాల నుంచి తరలిస్తున్న 123 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం.
Hyderabad: ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు.. భారీగా అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం!
Hyderabad: ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్లు ఏ అండ్ బి టీం ల సిఐలు రమేష్, గణపతి రెడ్డి సిబ్బంది కలిసి పహాడ్ షరీఫ్ వద్ద ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు చేశారు.
ఈ తనిఖీల్లో లో 42 మద్యం బాటిల్లు గోవా ఢిల్లీ ప్రాంతాల నుంచి వస్తున్నట్లుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సి అండ్ డి టీముల సిఐలు వెంకటేశ్వర్లు, నాగరాజులు సిబ్బంది కలిసి చేపట్టిన తనిఖీల్లో 81 మద్యం బాటిల్లు పట్టుబడ్డాయి. పట్టుబడిన మద్యం బాటిల్లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐలు తెలిపారు.




