LB Nagar: డిజిటల్ అరెస్ట్ పేరుతో మాజీ సైనికోద్యోగికి టోకరా.. రూ.8.75 లక్షలు స్వాహా!

LB Nagar: ఎల్బీనగర్‌ మన్సూరాబాద్‌కు చెందిన మాజీ సైనికోద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరించి రూ.8.75 లక్షలు కాజేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 21 Nov 2026 8:02 AM IST
LB Nagar
X

LB Nagar: డిజిటల్ అరెస్ట్ పేరుతో మాజీ సైనికోద్యోగికి టోకరా.. రూ.8.75 లక్షలు స్వాహా!

LB Nagar: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మాజీ సైనికోద్యోగిని మోసం చేసి రూ.8.75 లక్షలు కాజేశారు. మన్సూరాబాద్ సాయినగర్‌కు చెందిన చెరుకు స్వామిగౌడ్‌కు బుధవారం అపరిచిత వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.

తాము సైబర్ క్రైమ్ పోలీసులమని పరిచయం చేసుకున్న నిందితులు స్వామిగౌడ్ ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించి ఉగ్రవాదులకు అక్రమంగా నిధులు అందించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బెదిరించారు. అరెస్టు చేస్తామంటూ నకిలీ పోలీసు గుర్తింపులు, ఈడీ పత్రాలు, సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ను చూపించి భయాందోళనకు గురిచేశారు.

ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాకు స్వామిగౌడ్ రూ.8.75 లక్షలు బదిలీ చేశారు. అనంతరం తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి ఎల్బీనగర్‌లోని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR