Vikarabad: గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మెతుకు ఆనంద్!

Vikarabad: వికారాబాద్ గాంధీ పార్క్‌లో గాంధీజీకి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, రామయ్యగూడ PHCని సందర్శించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 2 Oct 2026 3:51 PM IST
Vikarabad
X

Vikarabad: గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మెతుకు ఆనంద్!

Vikarabad: వికారాబాద్ మున్సిపాలిటీ లోని గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీజీ విగ్రహానికి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం రామయ్యగూడ PHCని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మాట్లాడుతూ “ముందుగా ప్రతి ఒక్కరికీ మహాత్మా గాంధీజీ జయంతి శుభాకాంక్షలు.

గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది.

గర్భిణీ స్త్రీలకు అత్యవసరమైన ఐరన్ టాబ్లెట్లు & కాల్షియం టాబ్లెట్లు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరం. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ గారు మీ నియోజకవర్గంలోని PHCలలో మందులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మీరు విదేశాల్లో సెల్ఫీలు దిగుతున్నారు.

రామయ్యగూడ PHC ఒక్కటే కాదు, వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని PHCలలో ప్రజలకు అవసరమైన మందులు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి” అని డిమాండ్ చేశారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD