Vikarabad: గ్రాడ్యుయేట్లు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే!
Vikarabad: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దంపతులు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకున్నారు.
Vikarabad: గ్రాడ్యుయేట్లు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే!
Vikarabad: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, వారి సతీమణి గారితో కలిసి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు నమోదును ఆఫ్‌లైన్ విధానంలో పూర్తి చేశారు.
అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలి.
ఎవరు అర్హులు?
సంబంధిత గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో సాధారణ నివాసిగా ఉండాలి.
అర్హత:- 2023 అక్టోబర్ 31 వరకు డిగ్రీ లేదా సమాన అర్హత పూర్తి చేసి ఉండాలి
గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఓటు నమోదు కోసం Form-18 దరఖాస్తు చేయాలి.
నమోదు ఎలా చేసుకోవాలి?
ఆఫ్‌లైన్: Form-18ను పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత ERO/AERO కార్యాలయంలో సమర్పించవచ్చు.
ఆన్‌లైన్: ఎన్నికల సేవల అధికారిక పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న సంబంధిత సేవలను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యంగా: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు సంబంధిత MRO/ERO కార్యాలయంలో దరఖాస్తును సమర్పించి, నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూసుకోవాలి.
మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో కూడా తప్పనిసరిగా పరిశీలించండి.
అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని MLC Graduates’ Constituency ఓటుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాం.




