Hyderabad: వనస్థలిపురం డివిజన్ సమస్యలను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లిన నేత!
Hyderabad: వనస్థలిపురం డివిజన్ కాలనీల సమస్యలపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మాజీ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి. సానుకూలంగా స్పందించిన మంత్రి.
Hyderabad: వనస్థలిపురం డివిజన్ సమస్యలను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లిన నేత!
Hyderabad: ఈరోజు వనస్థలిపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వనస్థలిపురం డివిజన్లోని పలు కాలనీల అభివృద్ధి సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధానంగా అభ్యుదయ నగర్ కాలనీ, జనప్రియ కాలనీ, నాగార్జున కాలనీ, శక్తి నగర్ కాలనీ తదితర కాలనీలలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు మరియు ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను మంత్రి శ్రీధర్ బాబు గారికి వివరించారు.
కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీధర్ బాబు గారు సానుకూలంగా విని, సంబంధిత సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మాజీ కార్పొరేటర్ శ్రీ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శక్తి నగర్ కాలనీ అధ్యక్షులు అజయ్ గారు, అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షులు గంగిరెడ్డి గారు పాల్గొన్నారు.




