LB Nagar: నాగోల్‌లో మహాదేవ్ ఇన్‌ఫ్రా మెగా గేటెడ్ కమ్యూనిటీ భూమి పూజ!
LB Nagar: నాగోల్‌లో మహాదేవ్ ఇన్‌ఫ్రా ఆధ్వర్యంలో నిర్మించనున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్‌కు ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూమి పూజ చేశారు.
LB Nagar: నాగోల్‌లో మహాదేవ్ ఇన్‌ఫ్రా మెగా గేటెడ్ కమ్యూనిటీ భూమి పూజ!
LB Nagar: మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్‌కు భూమి పూజ, బ్రోచర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నాగోల్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజలో పాల్గొని, ప్రాజెక్టు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
నాగోల్ ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, నివాస అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన, ఆధునిక వసతులతో గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం అవసరమని అన్నారు. ప్రజలకు నమ్మకమైన, నాణ్యమైన నిర్మాణాలను అందించేందుకు నిర్మాణ సంస్థలు కృషి చేయాలని సూచించారు. మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ చేపడుతున్న ప్రాజెక్టు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బి. లింగయ్య యాదవ్, మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, మాజీ సీనియర్ నాయకులు పెరాల శేఖర్, మాజీ కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గాండే, సింగర్ నల్గొండ గద్దర్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మా రెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, నిర్మాణ రంగ ప్రతినిధులు, మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




