Quthbullapur: జగద్గిరిగుట్టలో ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
Quthbullapur: కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు ఆటపాటలతో సందడి చేశారు.
Quthbullapur: జగద్గిరిగుట్టలో ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
కుత్బుల్లాపూర్: తెలంగాణ సంస్కృతికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు కేసముద్రం మండలం జగద్గిరిగుట్ట, వెంకటేశ్వర నగర్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఔషధ గుణాలున్న తంగేడు, గునుగు, బంతి తీరొక రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలుస్తారు.
బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థమని, ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని, కుటుంబం సంతోషంగా ఉండాలని, యువతులు మంచి భర్త రావాలని కోరుతూ తోమిది రోజుల పాటు ఈపూల పండుగను తెలంగాణ ఆడబిడ్డలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని మహిళలు తెలిపారు. ఈకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.




