Hyderabad: మంత్రి తుమ్మలను కలిసిన ఏలూరు జడ్పీ చైర్మన్ సాయి నవ్యశ్రీ!

Hyderabad: హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఏలూరు జడ్పీ చైర్మన్ చింతమనేని సాయి నవ్యశ్రీ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 24 Nov 2026 8:31 PM IST
Hyderabad
X

Hyderabad: మంత్రి తుమ్మలను కలిసిన ఏలూరు జడ్పీ చైర్మన్ సాయి నవ్యశ్రీ!

హైదరాబాదు: హైదరాబాదులో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ (జడ్పీ చైర్మన్) చింతమనేని సాయి నవ్యశ్రీ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. గత నెలలో జరిగిన జిల్లా పరిషత్తు ఎన్నికల్లో జడ్పీటీసీగా ఎన్నికైన ఆమె ఏలూరు జడ్పీ చైర్మన్గా ఎన్నికైంది. ఈరోజు హైదరాబాదులో మంత్రి తుమ్మలను ఆమె మర్యాదపూర్వకంగా కలిసింది. చింతమనేని సాయి నవ్యశ్రీ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారి కుమార్తె.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆమెకు అభినందనలు తెలుపుతూ, ఏలూరు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసి భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని మంత్రి తుమ్మల ఆమెకు అభినందనలు తెలిపారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA