Vanasthalipuram: వనస్థలిపురంలో వృద్ధ పాల వ్యాపారిపై కత్తితో దాడి!
Vanasthalipuram: హైదరాబాద్ వనస్థలిపురం ఎన్‌జీవోస్ కాలనీలో వృద్ధ పాల వ్యాపారి భుజంగరావుపై కత్తితో దాడి.. రూ.20 లక్షల ఆస్తి వివాదమే కారణమని పోలీసుల అనుమానం.
Vanasthalipuram: వనస్థలిపురంలో వృద్ధ పాల వ్యాపారిపై కత్తితో దాడి!
Vanasthalipuram: ఎన్‌జీవోస్ కాలనీలో భుజంగరావు ( 75) అనే పాల వ్యాపారిపై కత్తితో దాడి ఘటన కలకలం రేపింది. శుక్రవారం ఉదయం సుమారు 6.10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన బుజంగ్‌రావును వెంటనే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం గూర్రంగూడకు చెందిన బుజంగ్‌రావు (75) ఎన్‌జీవోస్ కాలనీలో పాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన శివేందర్ సింగ్ (47) స్టేషనరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ పొరుగువారిగా తెలుస్తోంది.
2017లో గూర్రంగూడలో అపార్ట్‌మెంట్ ఫ్లాట్, షాపు కొనుగోలు కోసం శివేందర్ సింగ్ బుజంగ్‌రావుకు రూ.20 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అయితే ఆస్తిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయలేదని ఆరోపిస్తూ శివేందర్ సింగ్ కోర్టును ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ ప్రైవేట్ ఫిర్యాదు కేసులో ఆయన నిర్దోషిగా విడుదలైనట్లు సమాచారం.
ఈ పాత ఆస్తి వివాదం, కక్షల నేపథ్యంలోనే బుజంగ్‌రావుపై శివేందర్ సింగ్ కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడిలో తీవ్ర గాయాలైన బుజంగ్‌రావును ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి చర్యలు, బాధితుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




