Bachupally: బాచుపల్లిలో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడులు.. గంజాయితో ఇద్దరు అరెస్ట్
Bachupally: బాచుపల్లి మమత ఆసుపత్రి ఎదుట ఈగల్ ఫోర్స్ దాడులు చేసి ఎండీఎంఏ, గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు.
Bachupally: బాచుపల్లిలో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడులు.. గంజాయితో ఇద్దరు అరెస్ట్
బాచుపల్లి: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయాలపై ఈగల్ ఫోర్స్ దాడులు.. ఇద్దరు నిందితులు అరెస్ట్... మామతా ఆసుపత్రి ఎదురుగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఈగల్ ఫోర్స్. నిందితుల నుంచి 6.2 గ్రాముల ఎండీఎంఏ, 5.83 గ్రాముల ఎండు గంజాయి, రెండు ఐఫోన్లు, డ్రగ్స్ తూకం వేసే చిన్న యంత్రం, స్వాధీనం.
నిందితులను ఛత్తీస్గఢ్కు చెందిన చ.దినేశ్ కుమార్ (27), నీలాభ్ శర్మ (24)గా గుర్తింపు... 2024 నుంచి వ్యక్తిగత ఖర్చుల కోసం గంజాయి వ్యాపారం చేస్తున్న దినేశ్ కుమార్... మరో వ్యక్తి జేఎన్ సుహాస్తో కలిసి గంజాయి, ఎండీఎంఏ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు.
ఎండీఎంఏ గ్రాము రూ.5 వేలకు, గంజాయి ప్యాకెట్ రూ.600కు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించినట్లు వెల్లడి... ఏడుగురు డ్రగ్స్ కొనుగోలుదారుల వివరాలు సేకరించిన పోలీసులు.. సరఫరా నెట్వర్క్పై దర్యాప్తు... ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు.. పరారీలో ఉన్న మణికంఠ, జేఎన్ సుహాస్ కోసం గాలింపు.




