Kadtal: అన్మాస్పల్లిలో దుర్గామాత చీర రూ.1.60 లక్షలకు వేలం
Kadtal: కడ్తాల్ మండలం అన్మాస్పల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత చీరను రూ.1,60,000లకు కంబాలపల్లి రామకృష్ణ వేలంలో దక్కించుకున్నారు.
Kadtal: అన్మాస్పల్లిలో దుర్గామాత చీర రూ.1.60 లక్షలకు వేలం
రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం అన్మాస్పల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి వివిధ అలంకారాలు చేసి పూజలు నిర్వహించారు. బుధవారం అమ్మవారికి అలంకరించిన చీరల వేలం పాటను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మెళ్ళూరి వెంకటేశ్వర శర్మ, పూజారి శ్రీ కృష్ణమూర్తి నిర్వహించారు.
ఈ వేలంలో గ్రామానికి చెందిన కంబాలపల్లి రామకృష్ణ రూ.1,60,000 లకు అమ్మవారి చీరను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.1,20,000 లకు చీరను దక్కించుకున్న క్యాతిక వెంకటేష్ దంపతులతో పాటు, ఈ ఏడాది శ్రీ జ్ఞాన సరస్వతీ మాత నవరాత్రి చీరలను దక్కించుకున్న తొమ్మిది మందిని దేవాలయ కమిటీ చైర్మన్ కోర్పోలు లక్ష్మారెడ్డి, లీలా లక్ష్మారెడ్డి, కోర్పోలు సుధీర్ రెడ్డి, క్యాతిక పర్వతాలు యాదవ్ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.




