Talakondapally: పడకల్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ఘనంగా దుర్గామాత పూజా కార్యక్రమం. పాల్గొన్న గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి దంపతులు.
Talakondapally: పడకల్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో దుర్గామాత పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దుర్గామాత కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. పూజా కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భక్తి, సేవాభావం, గ్రామ ప్రజల ఐకమత్యానికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.




