Hyderabad: నిరుద్యోగ పట్టభద్రులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం!

Hyderabad: నిరుద్యోగ పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దుండ్ర కుమారస్వామి అన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 25 Nov 2026 1:46 PM IST
Hyderabad
X

Hyderabad: నిరుద్యోగ పట్టభద్రులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం!

Hyderabad: నిరుద్యోగ పట్టభద్రులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దుండ్ర కుమారస్వామి అన్నారు. ‘మన మాట – పట్టభద్రుల బాట’ కార్యక్రమంలో భాగంగా మన్నన్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని, ప్రభుత్వ నియామకాలు వేగవంతం చేయాలని సూచించారు. ఆరేళ్ల ఎమ్మెల్సీ ప్రాతినిధ్యంలో వాణి దేవి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి చేసిన కృషిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఎంపికైన అభ్యర్థులకు స్పాట్ ఆఫర్ లెటర్లు అందించే ఏర్పాట్లు చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE