Hyderabad: ప్రజా సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్సీలకు సవాల్!

Hyderabadపట్టభద్రుల కోసం చేసిన అభివృద్ధిపై సురభి వాణి దేవి, రామచంద్రరావు శ్వేతపత్రం విడుదల చేయాలని స్వతంత్ర అభ్యర్థి దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు:

RAJESH,	WEST ZONE
Published on: 27 Nov 2026 11:54 AM IST
Hyderabad
X

Hyderabad: ప్రజా సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్సీలకు సవాల్!

Hyderabad: పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేసిన సురభి వాణి దేవి, గతంలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన ఎన్. రామచంద్రరావు పట్టభద్రుల కోసం చేసిన అభివృద్ధి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం, విద్యారంగానికి అందించిన సేవలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలకు పట్టభద్రులు గుర్తుకొస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండే స్వతంత్ర నాయకత్వాన్ని ఈసారి గెలిపించాలని ఆయన కోరారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE