Ghatkesar: మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు ఘట్‌కేసర్ సీఐ శ్రీనివాస్
Ghatkesar: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఘట్‌కేసర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. అన్నోజిగూడ వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
Ghatkesar: మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు ఘట్‌కేసర్ సీఐ శ్రీనివాస్
ఘట్‌కేసర్: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీసులు నిఘా పెంచారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ సమీపంలోని హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు విధించడంతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల వాహనదారులతోపాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
వాహనంపై నియంత్రణ కోల్పోవడం, వేగాన్ని అంచనా వేయలేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలను నివారించడంతోపాటు వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా తమతోపాటు ఇతరుల ప్రాణాల రక్షణకు ప్రాధాన్యమివ్వాలని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు.




