Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్!

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.1.37 కోట్ల విలువైన 1,049 గ్రాముల బంగారాన్ని DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2026 7:09 AM IST
Hyderabad
X

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్!

Hyderabad: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద, మస్కట్ మీదుగా దుబాయ్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడిని DRI (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), HZU అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా, అతని ట్రాలీ బ్యాగ్‌లోని ఒక పర్సులో దాచి ఉంచిన, UAE గుర్తులు కలిగిన 1,049.76 గ్రాముల బరువున్న (24K/999 స్వచ్ఛత కలిగిన) తొమ్మిది బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం.

వీటి విలువ సుమారు ₹ 1.37 కోట్లుగా అంచనా.

ప్రయాణికుడిని విచారించగా, ఈ బంగారాన్ని విమానాశ్రయం బయట వేచి ఉన్న మరొక వ్యక్తికి అందజేయాల్సి ఉందని తేలింది. వెంటనే స్పందించిన అధికారులు, ఆ బంగారాన్ని స్వీకరించడానికి వచ్చిన వ్యక్తిని కూడా పట్టుకున్నారు.

సరైన దిగుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందుకు, కస్టమ్స్ చట్టం, 1962 (Customs Act, 1962) ఉల్లంఘనల కింద ఈ బంగారాన్ని స్వాధీనం.

ప్రయాణికుడిని మరియు బంగారాన్ని స్వీకరించడానికి వచ్చిన వ్యక్తిని, కస్టమ్స్ చట్టం, 1962లోని నిబంధనల ప్రకారం అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్