Osmania University: బాసర ట్రిపుల్ ఐటీపై తప్పుడు ప్రచారం తగదు: ఓయూ జేఏసీ
Osmania University: బాసర ట్రిపుల్ ఐటీ నీటి సమస్యపై వాస్తవాలు తెలుసుకోకుండా వినోద్ కుమార్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బహుజన, ఓయూ జేఏసీ చైర్మన్ వేల్పుల సంజయ్ ఖండించారు.
Osmania University: బాసర ట్రిపుల్ ఐటీపై తప్పుడు ప్రచారం తగదు: ఓయూ జేఏసీ
ఉస్మానియా యూనివర్సిటీ: బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సరఫరా సమస్యపై వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని బహుజన జేఏసీ మరియు ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మెన్ వేల్పుల సంజయ్ విమర్శించారు.
బాసర ట్రిబుల్ ఐటీ పై వినోద్ కుమార్ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని వినోద్ కుమార్‌ను హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో
సంజయ్ మాట్లాడుతూ.. గోదావరిలో నీటిమట్టం తగ్గడంతో పాటు నీటి సరఫరా చేసే మూడు మోటార్లలో రెండు పనిచేయడం లేదన్నారు. ఒకే మోటార్ ద్వారా బాసర ప్రజలు, ట్రిపుల్ ఐటీకి నీరు సరఫరా అవుతోందని తెలిపారు.
సమస్య పరిష్కారం కోసం అధికారులు కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు పలుమార్లు లేఖలు, ఈ-మెయిల్స్ పంపినా రెండు నెలలుగా స్పందన లేదన్నారు. సుమారు తొమ్మిది వేల మంది విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణను పరిశీలించినట్లు వివరించారు.
అలాగే 2013లో జరిగిన నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దళిత ప్రొఫెసర్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు.
విద్యార్థుల హక్కులు, విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం నిర్మాణాత్మకంగా పోరాడాలని, ఓయూ జేఏసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని వినోద్ కుమార్ కు సూచించారు.ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు ఎర్ర స్వామి, చంద్రశేఖర్, కృష్ణ, కుశాల్, ఆనంద్, సత్యం, దేవరాజ్, ప్రవీణ్, సంతోష్, అనిల్ కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు




