Diwali Fire Cracker Accidents: హైదరాబాద్‌లో బాణసంచా రాకెట్ల బీభత్సం..కాలి బూడిదైన గోదాములు, దుకాణాలు..!
Diwali Fire Cracker Accidents: దీపావళి వేడుకల వేళ హైదరాబాద్‌లోని 10 ప్రధాన ప్రాంతాల్లో బాణసంచా రవ్వల వల్ల భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి.
Diwali Fire Cracker Accidents: హైదరాబాద్‌లో బాణసంచా రాకెట్ల బీభత్సం..కాలి బూడిదైన గోదాములు, దుకాణాలు..!
Diwali Fire Cracker Accidents: వెలుగుల పండుగ దీపావళి వేడుకల వేళ భాగ్యనగరంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పండుగ సంబరాల్లో భాగంగా కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు, రాకెట్లు ప్రమాదవశాత్తు వివిధ వ్యాపార సముదాయాలు, గోదాములపై పడటంతో నగరంలోని సుమారు 10 ప్రధాన ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత కూడా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఒక ప్లాస్టిక్ గోదాంలో మొదలైన మంటలు వేగంగా పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. అధికారులు ఆరు ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీపావళి సంబరాల్లో భాగంగా ఒకరు కాల్చిన రాకెట్ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో ఉన్న టపాసులు భారీ శబ్దాలతో వరుసగా పేలిపోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇక్కడి బాలాజీ మెడికల్ షాప్‌లో హఠాత్తుగా అగ్నిప్రమాదం జరగడంతో వ్యాపారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విమానాశ్రయ సమీపంలో ఉన్న ఒక మెడికల్ వేర్‌హౌస్ మూడవ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. టపాసుల నిప్పురవ్వలు పడటంతో ఒక ఈవెంట్ మెటీరియల్స్ గోదాంలో భారీగా మంటలు చెలరేగి వేలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. బాణసంచా నిప్పురవ్వల కారణంగా తుక్కు గోదాంలో మంటలు అంటుకోవడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అట్టల గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక ఫర్నిచర్ గోదాంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న మరో నాలుగు గోదాములకు, అక్కడ నిలిపి ఉంచిన ఒక మినీ ట్రక్కుకు వ్యాపించి బూడిద చేశాయి. ఒక టపాసుల దుకాణంలో మంటలు వ్యాపించి అందులోని సామగ్రి మొత్తం కాలి బూడిదైంది.నగర వ్యాప్తంగా పలు వీధులు, కూడళ్లలో బాణసంచా వ్యర్థాల వల్ల చెత్త కుప్పల్లో చిన్నపాటి అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సమాచారం అందడమే తడవుగా ఫైర్ టెండర్లు ఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదాల వల్ల తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, అగ్నిమాపక శాఖ ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. బాణసంచా కాల్చేటప్పుడు వ్యాపార సముదాయాలు, గోదాముల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, ఫైర్ అధికారులు సూచించారు.




