LB Nagar: డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసలు.. కృత్రిమ కొలనులో గణేష్ నిమజ్జనం!
LB Nagar: నాగోల్ చాణక్యపురి కాలనీలో కృత్రిమ కొలనులో గణేష్ నిమజ్జనం. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసిన కాలనీ వాసులను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్.
LB Nagar: డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసలు.. కృత్రిమ కొలనులో గణేష్ నిమజ్జనం!
LB Nagar: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నాగోల్ చాణక్యపురి కాలనీలో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు.
చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులను ప్రశంసించారు.
ముఖ్యంగా.. గణేష్ విగ్రహాన్ని ప్రకృతి జలవనరుల్లో నిమజ్జనం చేయకుండా కాలనీ ఆవరణలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులో నిమజ్జనం చేయడాన్ని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.
పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పండుగను నిర్వహించడం ఆదర్శనీయమని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడంతో పాటు పర్యావరణహిత పండుగ వేడుకలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. చాణక్యపురి కాలనీ వాసులు చేపట్టిన ఈ విధానం పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలిచిందని డీజీపీ అభినందించారు.




