Secunderabad: కార్తీక మొదటి సోమవారం.. సికింద్రాబాద్ శివాలయాలు కిటకిట!
Secunderabad: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా సికింద్రాబాద్లోని ప్రధాన శివాలయాలకు ఉదయం నుండే భక్తులు బారులు తీరి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Secunderabad: కార్తీక మొదటి సోమవారం.. సికింద్రాబాద్ శివాలయాలు కిటకిట!
సికింద్రాబాద్: కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాలకు ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు చేరుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఈ రోజు భక్తులు ఉదయాన్నే తలస్నానం చేసి, బిల్వపత్రాలతో శివలింగానికి అభిషేకం, అర్చన చేసి, దీపారాధన చేశారు. చాలా మంది భక్తులు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు పూజలు నిర్వహించారు. ఆలయాల్లో రుద్రాభిషేకం, బిల్వార్చన, ప్రదోష పూజలు ఘనంగా నిర్వహించారు.కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ మాసం మొత్తం భక్తులు దీపాలు వెలిగించి, శివనామస్మరణతో గడుపుతారు. ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని ప్రధాన శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.




