Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా నాగుల చవితి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Secunderabad: నాగుల చవితి సందర్భంగా సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ నాగదేవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పుట్టలో పాలు పోసి, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

Srikanth, Secunderabad
Published on: 13 Nov 2026 6:04 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా నాగుల చవితి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

సికింద్రాబాద్: నాగుల చవితి పురస్కరించుకొని ప్రసిద్ధిగాంచిన నాగదేవ ఆలయాలకు ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. భక్తులు పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కార్తిక మాస శుక్ల చవితి తిథి రోజున జరుపుకునే హిందూ పర్వదినమే నాగుల చవితి.

ఈ రోజున భక్తులు నాగదేవతలను పూజించి, పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పిస్తారు. పురాణాల ప్రకారం ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపుగా, వాసుకి పరమేశ్వరుని కంఠాభరణంగా నిలిచారు. శాప విముక్తి, సంతాన సౌభాగ్యం, ఆరోగ్యం కోసం ఈ పూజలు చేస్తారని, నాగదేవత అనుగ్రహం వల్ల సకల సౌఖ్యాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad