Quthbullapur: ప్రతి ఏటా కార్తీక పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్విరామంగా నిర్వహిస్తాం!

Quthbullapur:కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులతో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది.

Sirisha Nemalikanti
Published on: 24 Nov 2026 12:57 PM IST
Quthbullapur
X

Quthbullapur: ప్రతి ఏటా కార్తీక పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్విరామంగా నిర్వహిస్తాం!

క్కుతాబుల్లాపూర్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, ఉప దేవాలయాల ఆవరణలో గిరి ప్రదక్షిణలు మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శివ స్వాములు, అయ్యప్ప స్వాముల తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో జగద్గిరిగుట్ట ప్రాంతం గోవింద నామస్మరణతో మారు మోగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణ 9 గంటల వరకు దాదాపు 3 గంటల పాటు భక్తులు ఉత్సాహంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన గిరిప్రదక్షిణ వేడుకలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకులు, భక్తులు, వ్యాపార సంస్థల యజమానులు పాల్గొని ఐక్యతను చాటుకున్నారు.

ప్రదక్షిణల అనంతరం కొలుకుల జగన్ తో పాటు భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొలుకుల జగన్ మాట్లాడుతూ ఈ సంవత్సరము నుండి మొదలైన ఈ గిరి ప్రదక్షణ ఇక నుండి ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజున నిర్విరారంగా కొనసాగిస్తామని అన్నారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఇంత గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దైవాన్ని రాజకీయాలతో ముడి పెట్టవద్దని జగన్ సూచించారు. ఆలయ అభివృద్ధికి తాను ఎల్లవేళల కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు, అయ్యప్ప, శివ స్వాములకు, వ్యాపార సంస్థ యజమానులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, గుడిమెట్ల సురేష్ రెడ్డి, జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్లు వేణు యాదవ్, సుధాకర్ రావు, యువ నాయకులు కొలుకుల జైహింద్, పార్శీ ప్రకాష్ గుప్తా, పల్లె దత్తాత్రేయ, సయ్యద్ రషీద్, పున్నారెడ్డి, జనార్ధన్, సురేష్ రెడ్డి, రమేష్ గుప్తా,తేరాల శ్రీనివాస్ గుప్తా, రేగూరి ప్రవీణ్ గుప్తా, పల్ల వెంకటరెడ్డి, పాపయ్య గౌడ్, మల్లేష్ గౌడ్, పాపిరెడ్డి, కైలాసం గుప్తా, గణేష్, బిక్షపతి, తారా సింగ్, ప్రభాకర్, ఇంద్ర గౌడ్, తోక యాదగిరి, సుధాకర్ రావు, మనోజ్,నాని,విట్టల్, నరసింహారెడ్డి, మల్లికార్జున్, శివ రుద్రా, మంజుల, శోభ, శాంతి,బాలు, రాజేష్,వినోద్,రఘు, విగ్నేష్, సంపత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దేవారీ మల్లేష్ కురుమ,తదితరులు పాల్గొన్నారు.

Sirisha Nemalikanti

Sirisha Nemalikanti