Shabad: ఎట్లా ఎర్రవల్లిలో వైభవంగా శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు!

Shabad: షాబాద్ మండలం ఎట్లా ఎర్రవల్లిలో శ్రీ దుర్గా మాతా ఉత్సవ కమిటీ 11వ వార్షికోత్సవ శరన్నవరాత్రులు. వైభవంగా పూజలు, భవానీ మాలధారణలు, తీర్థప్రసాద వితరణ.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 12 Oct 2026 5:44 PM IST
Shabad
X

Shabad: ఎట్లా ఎర్రవల్లిలో వైభవంగా శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు!

Shabad: షాబాద్ మండలం ఎట్లా ఎర్రవల్లి గ్రామంలో శ్రీ దుర్గ మాతా ఉత్సవ కమిటీ 11వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి.

గ్రామంలో నెలకొల్పిన దుర్గాదేవి మండపంలో రోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు దుర్గామాత మాలధారణ ధరించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నాడు. దేవి నవరాత్రుల నియమనిష్టలతో రోజువారీ పూజల్లో పాల్గొంటూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తున్నారు.

భవానీ మాలధారణ చేపట్టి అమ్మవారి సేవలో తరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా సదరు యువకుడు తెలిపారు. ప్రతినిత్యం సాయంత్రం వేళల్లో జరిగే మహామంగళ హారతి, భజన కార్యక్రమాలకు గ్రామంలోని మహిళలు, యవకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

అమ్మవారి కృపాకటాక్షాలతో గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామస్థులు మరియు నిర్వాహకులు ఈ సందర్భంగా కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు మరియు గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA