Hayathnagar: నగర శివార్లను కమ్మేసిన దట్టమైన పొగమంచు!

Hayathnagar: హైదరాబాద్ శివారు హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఓఆర్ఆర్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు. చలి తీవ్రతతో వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బందులు.

AJAY, HAYATH NAGAR
Published on: 26 Nov 2026 9:54 AM IST
Hayathnagar
X

Hayathnagar: నగర శివార్లను కమ్మేసిన దట్టమైన పొగమంచు!

Hayathnagar: నగర శివారు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట్, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలను మంచు దుప్పటిలా కప్పేసింది.

పచ్చని చెట్లు, రహదారులపై అలుముకున్న పొగమంచు ప్రకృతి అందాలను మరింత ఆహ్లాదకరంగా మార్చింది. మరోవైపు దట్టమైన మంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చలి తీవ్రతకు తోడు పొగమంచు ప్రభావంతో ఉదయాన్నే విధులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, మార్నింగ్ వాకర్స్ చలితో ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR