Medchal: చంద్రపురి కాలనీ, జవహర్‌నగర్‌లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి!
Medchal: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని చంద్రపురి కాలనీ, జవహర్‌నగర్‌లలో విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
Medchal: చంద్రపురి కాలనీ, జవహర్‌నగర్‌లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి!
Medchal: కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్, జవహర్‌నగర్ డివిజన్‌లలో ప్రజలు, విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ కోరారు.
ఈ మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించి, గ్రంథాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేలా జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడీశెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు గొడుగు వేణు, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, బల్లి శ్రీనివాస్, బింగి సతీష్ గౌడ్, మనోధర్ రెడ్డి, నాయకులు మాట్ల వినయ్ కుమార్, యాదగిరి యాదవ్, మాధవరెడ్డి, ఎర్రగుంట్ల వెంకటేష్, వీర్ల బుజ్జి, నాయకం భాస్కర్, నర మహేష్, బబ్లూ ముదిరాజ్, గజ్వేల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.




