Shabad: ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న సుధాకర్ రెడ్డి
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లింగారెడ్డిగూడ సర్పంచ్ పొన్న సుధాకర్ రెడ్డి గ్రామ అభివృద్ధికి చేస్తున్న సేవలను గుర్తించి ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్నారు.
Shabad: ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న సుధాకర్ రెడ్డి
షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ పొన్న సుధాకర్ రెడ్డి మండలంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, గ్రామ అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి ఉత్తమ సర్పంచ్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్నారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల అమలుతో పాటు గ్రామస్తుల సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకోవడంతో లింగారెడ్డిగూడ గ్రామంతో పాటు షాబాద్ మండలానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పొన్న సుధాకర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.




