Shabad: ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న శ్రీశైలం యాదవ్

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరిగూడ సర్పంచ్ పోనమోని శ్రీశైలం యాదవ్ బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్నారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 15 Nov 2026 4:34 PM IST
Shabad
X

Shabad: ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న శ్రీశైలం యాదవ్

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్ పోనమోని శ్రీశైలం యాదవ్ ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు గుర్తింపుగా బహుజన సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని అందజేసింది. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో చిత్తశుద్ధితో పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న సర్పంచ్ శ్రీశైలం యాదవ్ సేవలను ఈ సందర్భంగా గుర్తించారు.

బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా పోనమోని శ్రీశైలం యాదవ్ ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. తనపై నమ్మకంతో గ్రామ ప్రజలు అందించిన సహకారంతోనే ఈ గుర్తింపు సాధ్యమైందన్నారు.

ఢిల్లీలో జాతీయ స్థాయిలో గ్రామానికి గుర్తింపు తీసుకురావడంపై కుమ్మరిగూడ గ్రామ ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు గ్రామానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA