Hyderabad: డెక్కన్ సౌండ్‌స్కేప్ కొత్త హెడ్‌క్వార్టర్స్ ప్రారంభం!
Hyderabad: హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో డెక్కన్ సౌండ్‌స్కేప్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది.
Hyderabad: డెక్కన్ సౌండ్‌స్కేప్ కొత్త హెడ్‌క్వార్టర్స్ ప్రారంభం!
Hyderabad: ప్రముఖ ఆడియో, సంగీత వాయిద్యాలు, టెక్నాలజీ ఉత్పత్తుల పంపిణీ సంస్థ డెక్కన్ సౌండ్‌స్కేప్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో తన నూతన కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది.
30కి పైగా అంతర్జాతీయ, భారతీయ బ్రాండ్‌లతో రూ.120 కోట్ల టర్నోవర్ సాధించిన సంస్థ ప్రస్తుతం 60 మందికి పైగా ఉద్యోగులతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్త కార్యాలయంలో అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వ్యాపార విస్తరణ, సొంత బ్రాండ్‌ల పరిచయం, కొత్త ఉత్పత్తుల అభివృద్ధితో పాటు ఐపీఓ అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ జైన్ వెల్లడించారు.




