Kadthal: కడ్తాలలో మృతుడి కుటుంబానికి పరామర్శ.. రూ.5 వేల ఆర్థిక సాయం!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాలలో మృతి చెందిన శరణప్ప కుటుంబాన్ని డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా పరామర్శించి, రూ.5 వేల తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.
Kadthal: కడ్తాలలో మృతుడి కుటుంబానికి పరామర్శ.. రూ.5 వేల ఆర్థిక సాయం!
కడ్తాల: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం, కడ్తాల పట్టణానికి చెందిన భువనగిరి శరణప్ప కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. ఆదివారం ఆయన మృతి చెందిన విషయం తెలుసుకొని రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తో కలిసి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
బిఆర్ఎస్ పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉండి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం రూ 5,000/- వేల ఆర్థిక సహాయాన్ని భార్య సంతోషికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ హెచ్ఆర్ మహేష్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లాయక్ అలీ, మాజీ వార్డు సభ్యులు అశోక్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు అమృత పాండు, మండల ఆదివాసి సంఘం అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు మహేష్, నాగార్జున, సిద్దిగారి వెంకటేష్, సిద్ది గారి సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.




